మెడికో ఆత్మహత్యతో పెద్దపల్లి జిల్లాలో విషాదం

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన మోసం రమేష్, సుజాతల తనయుడు సనత్ మెడిసిన్ థర్డ్ ఈయర్ చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున సనత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సనత్ తండ్రి రమేష్ రామగుండం రీజియన్ ఓసీపీ 2లో పనిచేస్తున్నారు.