పఠాన్ సినిమా విడుదలకాక ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. కానీ సినిమా విడుదలయ్యాక టోటల్ గ్రాఫ్ మారిపోయింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం నుంచి సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి పఠాన్ సినిమా ప్రాణం పోసింది. ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించారు. షారుక్ ఖాన్ కు జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం ముఖ్యమైన పాత్రలో నటించారు.
పఠాన్ సినిమా జనవరి 25వ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిపబ్లిక్ డే కు ఒక రోజు ముందు విడుదలై … బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇది మాత్రమే కాకుండా పాత రికార్డులన్ని
బద్దలు కొడుతోంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే 18 వ రోజు వసూళ్ళు చేసిన కలెక్షన్స్ తో ఈ సినిమా రూ 1000 కోట్ల మార్క్ ను బద్దలు కొట్టింది. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం పై తెరకెక్కిన ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ తో తీసినందుకు .. ఫలితం కనిపిస్తుంది. పఠాన్ సినిమాలో యాక్షన్ సీన్స్, రొమాంటిక్ , ఫైట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక బాలీవుడ్ ఫిలిం క్రిటిక్, ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ఏంటంటే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిందట.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Next Post
