సరిహద్దుల్లో ఆపరేషన్ ‘సింధూర్’ స్టార్ట్…

అర్థరాత్రి మెరుపు దాడి…

భారత వైమానిక దళాల నేతృత్వం

దిశ దశ, అంతర్జాతీయం:

దాయాది దేశంతో యుద్దం మొదలైంది… దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం అందరి అంచనాలను తలకిందులు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదుల షెల్లర్ జోన్లను గుర్తించిన భారత నిఘా వర్గాలు పర్ ఫెక్ట్ స్కెచ్ వేశాయి. POKలో టెర్రరిస్టులు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలపై బుధవారం తెల్లవారు జామున 1.44 గంటలకు భారత వైమానిక దళాలు ముప్పేట దాడులు చేపట్టాయి. పహల్గామ్ దాడి తరువాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తో్ంది. అంతు చిక్కని వ్యూహ రచనతో ముందుకు సాగిన భారత రక్షణ వ్యవస్థ శత్రు దేశం ఊహలకందని విధంగా మెరుపు దాడులకు పూనుకుంది. ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరిట చేపట్టిన ఈ దాడులు నియంత్రణ రేఖ సమీపంలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్ పూర్ లో భారత సైన్యం దాడులకు చేపట్టింది. పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో కూడా వైమానిక దాడులు మొదలు పెట్టింది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ దాడుల్లో ఇప్పటికే 9 వరకు షెల్టర్ జోన్లను ధ్వంసం చేసినట్టుగా భారత రక్షణ శాఖ ప్రకటించింది. భారత దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న డెన్లను అంతమొందించడమే లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి.

You cannot copy content of this page