పాక్ ప్రేరిపిత ఉగ్ర వాదులు అడ్డాల వివరాలిలా…
దిశ దశ, అంతర్జాతీయం:
పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదులకు సరిహధ్దు ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఏరియాలుగా మారిపోయాయి. సేఫ్టీ ప్రాంతాలుగా భావించిన ఉగ్రవాద సంస్థలు భారత్ కు సమీపంలోనే ఉండడంతో కలిసి వస్తోందని నిరంతరంగా అక్కడ శిక్షణ ఇస్తున్నారు. చాలా కాలంగా వెయిట్ అండీ సీ అన్న ధోరణితో వ్యవహరిస్తున్న బారతదేశం నిఘా వర్గాలను తక్కువగా అంచనా వేసిన
దాయాది దేశం వారిని అక్కున చేర్చుకున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఉగ్ర సంస్థల కార్యకలాపాలపై సమగ్ర వివరాలు సేకరించిన భారత్ అంతర్జాతీయ సమాజానికి కూడా వీటి వివరాలను అందజేసినట్టుగా తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన భూ భాగంలో కూడా దర్జాగా షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నాయి ఉగ్ర సంస్థలు.
కోట్లీ జిల్లా…
హిజ్బుల్ ముజాహిదీన్ (HM) అనే ఉగ్రవాద సంస్థ పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (POJK)లోని కోట్లీ జిల్లా మహులి పులి సమీపంలో స్థావరం ఏర్పాటు చేసుకుంది. మీర్పూర్, కోట్లీ రహదారిపై మహులి వంతెన నుండి 2.5 కిలో మీటర్ల దూరంలో మస్కర్ రహీల్ షాహిద్ హిజ్బుల్ ముజాహిదీన్ (HM) సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు చాలా కాలంగా
కొనసాగుతున్నాయి. HM ఉగ్రవాదులు సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకున్నషెల్టర్ జోన్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. రహదారి సౌకర్యం అంతగా లేని ఈ ప్రాంతం అంత కొండలు విస్తరించి ఉంటాయి. మహులీ వంతెన ద్వారా మాత్రమే ఈ కేంద్రానికి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది తప్ప ప్రత్యామ్నాయంగా రోడ్డు కూడా లేదు. ఇక్కడకి కేవలం HM ఉగ్రవాదుల ట్రైనింగ్ కోసం మాత్రమే ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. బ్యారక్ లతో పాటు నాలుగు గదులతో నిర్మించిన ఈ భవనంలో మందుగుండు సామగ్రి, టెర్రరిస్టులు నివాసం ఉండేందుకు
అవసరమైన వసతులు కల్పించారు. ఇక్కడ శిక్షణ తీసుకునే ఉగ్ర వాదులకు, ట్రైనింగ్ ఇచ్చే వారికి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేశారు. కీకారణ్యంలో ఉన్న ఈ భవనంలో 150 నుండి 200 మంది HM ఉగ్రవాదులు ఉంటున్నారు. ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు 25 నుండి 30 మంది కూడా ప్రత్యేకంగా ఉంటున్నారు. ఇక్కడ శిక్షణ పొందే వారికి ఆయుధాల వినియోగం, శారీరక సామర్థ్యం కల్పించడం, BAT, స్నిపింగ్ తదితర అంశాలపై సుశిక్షుతులుగా తీర్చిదిద్దుతారు. ట్రెక్కింగ్ చేసేందుకు సమీపంలోని కొండలను వినియోగించుకుని
వారిని తీర్చిదిద్దుతున్నారు. HM ఉగ్రవాద నాయకుడు సయ్యద్ సలహుద్దీన్ నేతృత్వంలో ఈ శిబిర నిర్వహణ కొనసాగతుండగా దీనిని ఒక అబు మాజ్ పర్యవేక్షిస్తున్నాడు. ఈయన అబ్దుల్ రెహ్మన్ లు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటారు. అయితే ఈ స్ధావరంలో మరింత మందికి శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్న HM అగ్రనేతలు కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ భారత్ కు వ్యతిరేకంగా జిహాద్ పోరాటాల కోసం తయారు చేస్తున్నారు. ఈ సంస్థను అంతర్జాతీయ సమాజం కూడా
నిషేధించినప్పటికీ పాకిస్తాన్ కనుసన్నల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
షావాయ్ నల్హా క్యాంప్…
PoJK లోని ముజఫరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన షావాయ్ నల్హా క్యాంప్ లో లష్కర్ ఏ తోయిబా (LeT) కార్యకలాపాలను కొనసాగిస్తోంది. భారత సరిహధ్దు ప్రాంతాల్లో LeT ఏర్పాటు చేసుకున్న క్యాంపులలో ఈ డెన్ అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ LeT రిక్రూట్ మెంట్, శిక్షణ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. 2000 సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ క్యాంప్ లో ఫైరింగ్ రేంజ్, ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా గ్రౌండ్, మదర్సాను నిర్వహిస్తున్నారు. 40 గదుల వరకు ఉన్న షావాయ్ నల్హా క్యాంపులో ఉగ్రవాద కమాండర్లు, బోధకుల నివాసలు కూడా ఉన్నాయి. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ దౌరా-ఎ-ఆమ్ ద్వారా శిక్షణ అందించేందుకు బేస్ క్యాంప్‌గా ఉపయోగిస్తున్నారు. శారీరక శిక్షణతో పాటు GPS వినియోగంపై
ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం, మ్యాప్ రీడింగ్, ఆయుధ శిక్షణతో పాటు గ్రెనేడ్స్ తో దాడులు చేయడంపై కూడా తర్ఫీదు చేస్తున్నారు. ఈ సంస్థలో కొత్తగా చేరే వారికి చీఫ్ హఫీజ్ సయిద్ అక్కున చేర్చుకుని అన్ని అంశాలపై శిక్షణ ఇస్తుంటారు. తొలి దశలో ఇక్కడ ట్రైనింగ్ పూర్తయిన తరువాత యాక్టివ్ గా ఉన్న ఉగ్రవాదులను LeT నిర్వహించే ఇతర క్యాంపులకు
తరలించి ఇతరాత్ర అంశాలపై ట్రైనింగ్ ఇస్తుంటారు. అలాగే కమాండర్లు, క్యాడర్ కోసం షావాయ్ నల్హా క్యాంపులో రిప్రెష్ మెంట్ కోర్సులను నిర్వహిస్తుంటారు. ఈ క్యాంపులో 200 నుండి 250 మందికి చాలినన్ని వసతులు ఏర్పాటు చేశారు. నిరంతరం ఇక్కడ 100 మంది వరకు ట్రైనింగ్ అవుతుండగా, 26/11 ముంబాయి దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ తో పాటు ఇతర ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. భారత భూభాగంలో చొరబడేందుకు LeT దీనిని స్టేజింగ్ క్యాంపుగా కూడా వినియోగించారు. ఇక్కడి వారిని కశ్మీర్ సరిహధ్దుల్లో ఉన్న ప్రాక్టికల్ ట్రైనింగ్ సెంటర్లకు పంపిస్తారు. LeT కమాండర్ అబూ దుజానా ఇంఛార్జీగా వ్యవహరిస్తుండగా ఇతనికి సహయకుడిగా ఖమర్ భాయ్ పని చేస్తున్నాడు. LeTకి చెందిన సీనియర్ కమాండర్లు తరుచూ ఈ క్యాంపును సందర్శిస్తుంటారు. ఇక్కడ మరింత ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేందుకు నూతన నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి.
సుభాన్ అల్హా సెంటర్…
పాకిస్తాన్ లోని పంజాబ్ లో NH-5 (కరాచీ తోర్ఖం హైవే) వద్ద కరాచీ మోర్, బహవల్పూర్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జైష్ ఏ మోహమ్మద్ (JM) ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ మర్కజ్ కేంద్రంగానే 2019నాటి పుల్వామా దాడి జరిగింది. ఇక్కడ JM చీఫ్ మౌలానా మసూద్ అజార్, డిఫాక్టో చీఫ్ అబ్దుల్ రవుఫ్ అస్గర్,
మౌలానా అహ్మద్ తో పాటు మరికొందరి నివాసాలు ఉన్నాయి. ముప్తీ అబ్దుల్ మసూద్ అజార్ అతని సోదరులు, బావమరిది, సాయుధ విభాగం అధిపతి చూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ గౌరీ వంటి సీనియర్ జైఎం కార్యదర్శులు ఇక్కడే ఉంటున్నారు. 600 మందికి పైగా ఉండేందుకు అనువుగా ఉన్న ఈ మర్కజ్ లో మౌలానా రఫీకుల్లా 2022 నుండి ట్రైనింగ్ ఇస్తున్నారు. పాకిస్తాన్ సహకారంతో ఈ క్యాంపు నిర్మించగా 2015 నుండి ఇక్కడ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. 2018లో వ్యాయామ శాల, స్విమ్మింగ్, డీప్ వాటర్ డైవింగ్ కోర్సులపై ట్రైనింగ్ ఇస్తున్నారు. షురా సభ్యులకు ఆరు రోజుల పాటు విలు విద్యపై కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. 2019లో కొత్తగా అల్ హిజామా స్థాపించగా, హార్స్ స్టేబుల్స్, రైడింగ్ గ్రౌండ్ ను 2022లో నిర్మించారు. 2024 నవంబర్ 30న మౌలానా మసూద్ అజార్ ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిని ఉధ్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబ్రీ మస్జీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని, భారత దేశానికి వ్యతిరేకంగా ఉద్రేకపూరిత ప్రసంగాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మౌలానా తల్మ సైఫ్, మహ్మద్ అబ్దుల్లా బిన్ మసూద్ తో పలువురు ఉగ్రవాదులు హాజరయ్యారు. 2023 జులైలో ΜΜΑ తన కుటుంబ సభ్యులు, సోదరులు, సీనియర్ కేడర్ తో కలిసి ఈద్ ఎల్ అజా కార్యక్రమం నిర్వహించారు.
రాజస్థాన్ లోని హజువాలా బికనీర్ కు ఎదురుగా, భారత సరిహద్దులకు 100.4 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ముప్తీ అబ్దుల్ రౌస్ అస్గర్ KPK ఆధారిత స్మగ్లర్ల ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో NATO దళాలు ఇటీవల కొనుగోలు చేసిన M4 రైఫిల్స్, ఇతరాత్రా ఆయుధాలు, సరుకులను సమకూరుస్తాడు. జీఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్ బంధువులు, మేనల్లుడు తల్హా రషీద్, ఉస్మాన్, ఉమర్, మహ్మద్ ఇస్మాయిల్ అలియాస్ లంబుతో సహ పలువురు ఫిదాయిన్ దాడికి పాల్పడడంతో పాటు ఆయుధ శిక్షణ కోసం బాలకోట్ కు పంపించారు. ఉగ్రవాద సంస్థగా వివిధ దేశాలు ఈ సంస్థను గుర్తించాయి.
మర్కజ్ అబ్బాస్…
PoJKలోని కోట్లిలో మొహల్లా రోలీ ధార బైపాస్ రోడ్డులో ఉంది ఈ క్యాంప్ మర్కజ్ సైద్నా హజ్రత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతాలిబ్ (మర్కజ్ అబ్బాస్)గా ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ కోట్లి మిలటరీ క్యాంపునకు ఆగ్నేయంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 100 నుండి 225 మంది జైష్ ఏ మహ్మమ్మద్ క్యాడర్లు నివాసం ఉండేందుకు అనువుగా ఉన్న ఈ క్యాంపులో 40 నుండి 50 మంది ఇక్కడే ఉంటూ జైష్ సంస్థ ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. JM కౌన్సిల్‌లో షురా సభ్యుడు హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ జరార్ అధిపతిగా వ్యవహరిస్తున్న ఈ శిబిరం నడుస్తోంది. మౌలానా మసూద్ అజార్ తో కలిసి జైష్ ఏ మోహ్మద్ స్థాపించిన హర్కత్ ఉల్ ముజాహిదీన్ (HuM)లో ఒక భాగంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద దాడులకు వ్యూహాలు రచించి విధ్వంసాలను అమలు చేయడంలో ఖరీ జరార్ ప్రత్యక్ష్యంగా కూడా పాల్గొంటాడు. 2016 నవంబర్ 29న
జమ్మూలోని నగ్రోటాలోని బలినీ బ్రిడ్జి సమీపంలో ఉన్న భారత ఆర్మీ క్యాంప్ పై జరిపిన దాడిపై NIA నమోదు చేసిన కేసులో నిందితుడు కూడా. అఫ్ఘనిస్తాన్ లో తనకున్న పరిచయాలతో నిధుల సేకరణ, మర్కజ్ అబ్బాస్ శిబిరంలో ఉన్న ఇతర ఉగ్రవాదుల్లో ఖరీ జరార్ కొడుకు ఖరీ మాజ్, మహ్మద్ మావియా ఖాన్, తాహిర్ నజీర్, అబూబాకర్ లు కూడా
అక్కడే ఉంటున్నారు. పఠాన్ కోట్ దాడి తర్వాత సియాల్ కోట్ లోని దస్కా మర్కజ్ లో దాచిపెట్టిన ఆయుధాలను, మందుగుండు సామగ్రిని POKలోని కోట్లి మర్కస్ అబ్బాస్ కు తరలించారు. కొన్ని సమయాల్లో మర్కజ్ అబ్బాస్ నుండి ఖర్రీ జరార్ తన వాహనంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని సియాల్ కోట్ కు రవాణా చేస్తుంటాడు. ఉత్తర ఖశ్మీర్ లాంచ్ డిటాచ్ మెంట్ కు ఇంఛార్జిగా ఉన్న ఖరీ జరార్ కొడుకు మువాజ్ అలియాస్ ఖారీమ మాజ్ పని చేస్తున్నారు. 2018 అక్టోబర్ లో అఫ్టనిస్తాన్ నుండి తిరిగి మర్కజ్ అబ్బాజ్ శిబిరానికి చేరుకున్నాడు. ప్రపంచలోని వివిధ దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
మర్కజ్ అహ్లే హదీస్…
లష్కర్ ఏ తోయిబా(LeT) శిబిరం నిర్వహిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఈ క్యాంప్ భింబర్ జిల్లాలో ఉంది. LeT నిర్వహించే ఉగ్ర శిబిరాలలో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఇది ఒకటి. కోటే జమేల్ రోడ్డులో… బర్నాలా పట్టణ శివారు ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. మర్కజ్ అహ్లే హదీస్ గా పిలుస్తున్న ఈ క్యాంపులో 100 నుండి 150 మంది
నివాసం ఉండేందుకు అనువుగా నిర్మించారు. 40 నుండి 50 మంది ఇక్కడే నివాసం ఉంటూ ఉగ్ర కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ మర్కజ్ భారత భూ భాగంలోకి చొరబడక ముందు LeT ఉగ్రవాదులు ఇక్కడ స్టేజింగ్ సెంటర్ గా ఉపయెగించుకునేవారు. ఇక్కటి నుండి టెర్రర్ ఆపరేటింగ్ సిస్టంను ఖాసీం గుజ్జర్ అలియాస్ మహరోర్, ఖాసీం ఖండా, అనస్ జరార్ లు ఈ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఖుబైల్ అలియాస్ మోహమ్మద్ అమీన్ బట్ తరుచూ ఈ మర్కజ్ కు వస్తుంటాడు. ఖాసీం గుజ్జర్, ఖుబైల్ లను భారత ప్రభుత్వం నిషేధం విధించింది. సైఫుల్లా సాజిద్ జుట్, అబు కతాల్ సింధీ హత్యకు గురి అయ్యాడు. ధంగ్రీ, రాజౌరీలో పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఘటనలో ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎల్‌ఈటీ/జమాత్-ఉద్-దవా/జమ్మూ & కాశ్మీర్ యునైటెడ్ మూవ్‌మెంట్ యొక్క ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణతో పాటు పర్యవేక్షణ
చేసేందుకు ఈ మర్కజ్ కు LeT, JuD నాయకులు సందర్శిస్తుంటారు.
మెహమూనా జోయా ఫెసిలిటీ…
సియాల్ కోట్ వద్ద హిజ్బుల్ ముజాహిదీన్ (HM) మెహమూనా జోయా ఫెసిలిటీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ పంజాబ్లోని సియాలో జిల్లా హెడ్ మరాలా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి కేంద్రంగా ఉగ్రవాదులతో మిలాఖత్ అయిన వారికి ఉపయోగపడుతోంది. ఇలాంటి సౌకర్యాలను పాక్ ప్రభుత్వం భారత సరిహధ్దులు, LOC వెంట ప్రత్యేకగా ఏర్పాటు చేయించింది. టెర్రరిస్టులు దాడులు చేసేందుకు అవసరమైన పదార్థాలను నిలువ చేసేందుకు ఈ ఆసుపత్రిని వాడుకుంటున్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ లోకి చొరబాట్లను పెంచి పోషించేందుకు ఈ ఫెసిలిటీ సెంటర్ కీలకంగా ఉపయోగపడుతోంది. సీనియర్ కమాండర్లతో ఉగ్ర కార్యకలపాలు, ఆయుధాల నిర్వహణ, శిక్షణ ఇస్తున్నారు. మోహమ్మద్ ఇర్ఫాన్ కాన్ అలియాస్ ఇర్ఫాన్ తండా కమాండర్ గా వ్యవహరిస్తున్న ఈ సెంటర్ జమ్మూ, కశ్మీర్ లో విధ్వంసాలు సృష్టించడం కోసమే నిర్వహిస్తున్నారు. 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుసపేళుల్లలో ఎనిమిది మందిని హతం చేసిన దాడుల్లో ఇర్ఫాన్ తండా నాయకత్వం వహించాడు. అప్పటి గవర్నర్ కెవి కృష్ణారావు ఈ దాడి నుండి తృటిలో్ తప్పించుకోగా జమ్మూ, కశ్మీర్ లోకి చొరబాట్లను ప్రొత్సహించే పనిలో కూడా నిమగ్నం అవుతాడు. అంతేకాకుండా ఈ ఫెసిలిటీ సెంటర్ నుండి లోయల్లో షెల్టర్ తీసుకునే ఉగ్రవాదులకు ఆయుధాలను రవాణ
చేసేందుకు కూడా ఉపయోగపడుతోంది. ఇక్కడి కీలకంగా వ్యవహరించే కమాండర్లలో అట్టా అల్ రెహ్మాన్ అల్ఫెజీ అలియాస్ అబు లాల, మాజ్ భాయ్ లు వ్యవహరిస్తున్నారు. ఇర్ఫాన్ ఘమ్మాన్ ఈ సెంటర్ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తుండగా జమ్మూ, సాంబా సెక్టార్ లో భారత భద్రతా దళలాపై దాడులు నిర్వహించడంలోనూ పాల్గొన్నాడు. ఇక్కడ ముడు
సాధారణ గదులు ఒక వంట గదితో పాటు వాష్ రూం నిర్మాణం జరిపారు. నిరంతరం ఇక్కడ 50 మంది నివాసం ఉంటూ భారత్ లోకి చొరబాట్లు, దాడులకు సంబంధించిన వ్యూహాలను అమలు చేస్తుంటారు. ఈ ఉగ్ర సంస్థపై అంతర్జాతీయంగా నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ తన కార్యకలాపాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తూనే ఉంది. భారత్ లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేందుకు నిధుల సమీకరణకు కూడా ఈ కేంద్రం నుండే సాగుతోంది. రిబ్బా (ఇంటెలిజెన్స్ శిక్షణ) కూడా ఇస్తున్నారు. 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారులైన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ, తహవుర్ హుస్సేన్ రాణా, జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ, అబ్దుల్ రెహ్మాన్ సయ్యద్ @ పాషా, హరూన్, ఖుర్రామ్ లతో కలిసి మురిడ్కేను సందర్శించారు. LeT సిద్ధాంతకర్తలు అమీర్ హంజా, అబ్దుల్ రెహ్మాన్ అబిద్ మరియు జాఫర్ ఇక్బాల్ ఈ మర్కజ్ ప్రాంగణంలోనే నివసిస్తున్నారు. LeT కమాండర్లు ఖుబైబ్, ఇసా మరియు ఖాసిం తరచుగా ఈ మర్కజ్‌ని సందర్శిస్తుంటారు. వీరిత్ పాటు హఫీజ్ సయీద్ మరియు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీతో సహా LeT యొక్క అనుబంధ తీవ్రవాద సంస్థలకు ఇక్కడ నివాసాలు ఉన్నాయి. నుండి అహ్లే హదీస్ (LeTని అనుసరించేందుకు) దావా ఇక్కడ మాత్రమే నిర్వహించబడుతోంది. ఈ మార్కజ్ LeTకి వ్యూహాన్ని అందిస్తుండగా, ఘజ్వత్-ఉల్-హింద్ కోసం కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నాయి. ఎల్‌ఇటిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ పాకిస్తాన్ దాని నిర్వహణ కోసం అనుమతించింది.
రంజాన్ చివరి 10 రోజులు మసీదులో ఉండే కాలంతో కూడిన ఇస్లామిక్ అభ్యాసం ఇతికాఫ్ ఈ మర్కజ్ ద్వారా నిర్వహించబడుతోంది.
సర్జల్ టెహ్రా సెంటర్
సర్జల్/టెహ్రా కలాన్ సెంటర్ జైష్ ఏ మహ్మద్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. J&K లోకి ఉగ్రవాదుల చొరబాటు కోసం ఇది మెయిన్ లాంచ్ సైట్. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని నరోవల్ జిల్లాలోని షకర్‌గఢ్ తహసీల్‌లో ఉంది.ఈ సదుపాయం సర్జల్ ప్రాంతంలోని టెహ్రా కలాన్ విలేజ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో నిర్వహిస్తూ ఉగ్ర
కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంది. తీవ్రవాద మద్దతుదారులు, పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో JM మరియు HM ఉగ్ర సంస్థల కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల నుండే ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. J&K లోని సాంబా సెక్టార్‌లో భారత సరిహద్దులకు 6 కిలోమీటర్ల సమీపంలో ఉండడంతో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కోసం సరిహద్దుల్లో సొరంగాలను తవ్వించి భారతదేశంలోకి జేఎం క్యాడర్‌లను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. ఆర్నియా-జమ్ము సెక్టార్‌లోని సరిహద్దులంతాటా తవ్విన
సొరంగాలన్ని కూడా ఇక్కడే వేసుకున్న పథకం ప్రకారమే అమలు చేస్తున్నారు. సర్జల్ సదుపాయం డ్రోన్‌ల కోసం లాంచింగ్ బేస్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదక ద్రవ్యాలను భారత భూభాగంలోకి పంపిస్తున్నారు. డ్రోన్స్ ద్వారా కూడ భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు ఈ కేంద్రం ముఖ్యమైన టెర్రర్ బేస్‌గా వ్యవహరిస్తోంది. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడంతో పాటు హెచ్‌ఎఫ్ రేడియో రిసీవర్లు, ఇతర కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా సమకూర్చుకున్నారు. ఈ కాంప్లెక్స్‌లో ప్రవేశ ద్వారం దగ్గర 6 నుండి 7 గదులు, ఆరోగ్య పరీక్షల కోసం PHC వైద్యులు, సిబ్బంది ఉంటారు. పార్కింగ్‌కు సమీపంలో ఉన్న రెండు క్వార్టర్లలో ఒక హాల్ లో JM వారి ఆపరేషనల్ కమాండర్లు, క్యాడర్‌ల కోసం వాడుకుంటున్నారు. భారత దేశంలోకొ చొరబాట్లను పర్యవేక్షించడం, ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించేందుకు ఈ ఫెసిలిటీ సెంటర్ లో 20 నుండి 25 మంది మకాం ఉంటున్నారు. JM టెర్రరిస్ట్ కమాండర్లు మొహమ్మద్ అద్నాన్ అలీ @ డాక్టర్ కాషిఫ్ జాన్ ఇక్కడికి క్రమం తప్పకుండా వస్తుంటారు. JM
యొక్క డి-ఫాక్టో చీఫ్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ దీని కేంద్రంగా JM కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా నడుస్తున్న ఈ క్యాంప్ లో ఉన్నవారిందరిని డాక్టర్ అనే మారు పేరుతో పిలుస్తుంటారు. డాక్టర్ అద్నాన్ మరియు కాషిఫ్ జాన్‌లు ఉగ్రవాదులుగా గుర్తించబడ్డారు. మే 2014లో అద్నాన్ @ డాక్టర్ థాయిలాండ్‌లోని మే-సోట్‌లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF) కార్యకర్త రామన్‌దీప్ సింగ్ @ గోల్డీకి పారా-గ్లైడర్ల గురించి శిక్షణను అందించాడు. అద్నాన్ @ డాక్టర్ పర్యవేక్షణలో జగ్తార్ సింగ్ తారా, అతని సహచరులు జస్విందర్ సింగ్ జస్సా, మహ్మద్ ఉమర్ గొండాల్ ద్వారా శిక్షణ పొందారు. చొరబాట్ల కోసం సొరంగాలు, హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉగ్ర దాడుల కోసం పారా-గ్లైడర్‌లను ఉపయోగించడం వంటి ఈ వ్యూహాలు మధ్య-ప్రాచ్యంలోని సంఘర్షణలో హమాస్ అమలు చేస్తున్నవే కావడం గమనార్హం. జెఎమ్‌కు చెందిన సర్జల్ ఫెసిలిటీ నుండి పనిచేస్తున్న అలీ జాన్ @ కాషిఫ్ జాన్, పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 2016 పఠాన్‌కోట్ ఉగ్రదాడిని ప్లాన్ చేసి అమలు చేసిన ప్రధాన కుట్రదారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి సమయంలో కాషిఫ్ జాన్ టెర్రరిస్టులతో నిరంతరం ఫోన్‌లో సమన్వయం చేసుకుంటూ, దాడిని అమలు చేసేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ, మార్గనిర్దేశం చేశాడు. JM కార్యకర్తలు అల్లా బక్ష్ ముసైబ్ (JM చీఫ్ మౌలానా మసూద్ అజార్ మేనల్లుడు), ముహమ్మద్ ఇర్ఫాన్ ఆరిఫ్ @ ఘుమాన్ (BAT చర్యలలో పాలుపంచుకున్నారు),
వసీమ్ నూర్ జుట్ (JM లాంచింగ్ కమాండర్) మరియు అబ్దుల్ రెహ్మాన్ @ భాయ్ జిగర్ (డాక్టర్‌కు డిప్యూటీ) ఇక్కడి నుండే చొరబడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్తావరాలపై సమగ్ర అధ్యయనం చేసిన బారత నిఘా వర్గాలు సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తూనే ఉన్నాయి. దీంతో ఈ సంస్థలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని సంకల్పంచిన భారత సైన్యం ఉగ్ర కేంద్రాలే లక్ష్యంగా ముప్పేట దాడి చేసింది.