రేపు విచారణకు రావాలన్న సిట్…
దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆ నోటీసులో పేర్కొంది. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం గమనార్హం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడు ఎవరికి సిట్ నోటీసులు ఇస్తుందో అంతు చిక్కకుండా పోతోంది. హరీష్ రావు తరువాత కేటీఆర్ కు ఆ తరువాత బీఆర్ఎస్ చీఫ్ కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం గమనార్హం.

