మునిసిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం…

దిశ దశ. హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరుపున జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణాలో స్నేహ పూర్వక వాతావరణంలో జనసేన, బీజేపీ పోటీ చేస్తున్నాయని ఈ నేఫథ్యంలో ఈ రెండు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పవణ్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 7,8 తేదిలలో డిప్యూటీ సీఎం టూర్ కు సంబంధించిన రూట్ మ్యాప్ తయారవుతున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం.