మసూద్ అజర్ కు బిగ్ షాక్…

దిశ దశ, అంతర్జాతీయం:

శత్రు దేశాన్ని చావుదెబ్బ కొట్టింది భారత్ సైన్యం. ఉగ్ర వాదులను పెంచి పోషిస్తూ భారత దేశంలో విధ్వంసాలకు ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ను  ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రపంచమంతా ఆర్థిక బలోపేతం, సాంకేతివ విప్లవం వైపు సాగుతుంటే దాయాది దేశం మాత్రం సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించడమే పనిగా పెట్టుకుంది. ఓ వైపున స్వదేశంలో ఆర్థిక మాంద్యం కొట్టుమిట్టాడుతుంటే నియంత్రించుకోలేని దుస్థితికి చేరిన పాక్ భారత్ తో కవ్వింపు చర్యలకు పూనుకోవడం మాత్రం మానడం లేదు. సుపరిపాలన చేయాలని పాకిస్తాన్ సగటు పౌరుడు ఆకాంక్షిస్తుంటే జమ్మూ కశ్మీర్ ను కైవసం చేసుకోవాలన్న కుట్రలకు తెరలేపుతోంది. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి తట్టుకోలేకపోతున్న పాక్ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఉగ్ర సంస్థలకు బాసటగా నిలుస్తోంది. కట్టడి చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం ముందు ఎన్ని సార్లు బుజ్జగించినా తన వక్ర బుద్దిని సక్రమ మార్గంలో పెట్టుకోవడం లేదు. ప్రపంచ దేశాలకు ముందుగానే పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదం గురించి సాక్ష్యాధారాలతో వివరించడంలో భారత ప్రధాని నరేంద్ర మోడి సఫలం అయ్యారు. ఓ వైపున భారత దేశం యుద్దానికి సై అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. మంగళవారం అర్థరాత్రి పాక్ సైన్యం ఏకపక్షంగా కాల్పులకు పాల్పడడంతో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడ్డారు. సహనానికి ఓ హద్దు ఉంటుందని, హెచ్చరికలు చేసినా లాభం లేకుండా పోతోందని గమనించిన భారత్ కార్య రంగంలోకి దిగింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ తో పాటు, ఆక్రమిత కశ్మీర్ లో బాంబుల వర్షం మొదలైంది. బహవల్‌పూర్‌లోని జైస్ ఏ మోహ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న మసూద్ అజార్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా భారత్ చేసిన దాడులు సఫలం అయ్యాయి ఈ ఘటనలో ఆయన ప్రధాన కార్యాలయంతో పాటు మదర్సా తుడిచిపెట్టుకపోయిందని పాకిస్తాన్ మీడియా కూడా ధృవికరించింది. మరో వైపున ఏ యుద్ద విమానాన్ని చూసి పాకిస్తాన్ మురిసిపోయిందో దానిని భస్మీపటలం చేయడంలో భారత సైన్యం సక్సెస్ అయింది. పాకిస్తాన్ వీర్రవీగిన F-16 యుద్ద విమానాన్ని భారత వైమానిక దళాలు కూల్చివేసినట్టుగా రక్షణ శాఖ వర్గాల ద్వారా సమాచారం. ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరిట చేపట్టిన ఈ దాడుల్లో భారత్ 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేశామని ప్రకటిస్తే మొత్తం 24 చోట్ల భారత్ తమపై దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత దేశం క్షిపణి దాడులు చేస్తోందన్న సంకేతాలను కూడా అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ట్విట్ చేశారు. భారత్, పాక్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల నాయకత్వంతో సంప్రదింపులు జరిపుతానని ప్రకటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదానికి సంబంధంచిన ఎవిడెన్సులతో సహా దోవల్ సవివరంగా వివరించినట్టు సమాచారం. మరో వైపున పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతగా పూర్తి చేసుకున్న వైమానిక బృందాలు సేఫ్ గా స్వదేశంలో ల్యాండ్ అయ్యాయి.

దేశ వ్యాప్తంగా దీపావళి… 

దాయాది దేశం ఆగడాలను కట్టడి చేసేందుకు భారత సైన్యం చేపట్టని ‘ఆపరేషన్ సింధూర్’’పై స్వదేశంలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీర్ యువత రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ మురదాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినదిస్తున్నారు. ప్రయాగరాజ్ లో వేకువ జామున దీపావళి పర్వదినాన్ని మరిపించే విధంగా టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.

You cannot copy content of this page