కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ నివేదిక
దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో TSERL నిర్వహించిన మోడల్ స్టడీస్ వైఫల్యం అయ్యాయాని NDSA తన నివేదికలో వెల్లడించింది. పాండ్ స్థాయిలో బ్యారేజీ గేటు తెరిచే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. 2019 నుండి హైడ్రాలిక్ జంప్ ఏటా ఆటంకంగా మారిందని, మూడు బ్యారేజీలకు దిగువన ఉన్న అప్రాన్, సీసీబ్లాకులు కొట్టుకపోయాయని పేర్కొంది. బ్యారేజీలు నిరంతరం పనిచేయాలన్న కారణంగా ఈ అంశాన్ని విస్మరించారని వాస్తవంగా సరైన స్కేలింగ్, మోడలింగ్ చేయడం ద్వారా సరిదిద్దే అవకాశాలు ఉన్నాయని వివరించింది. TSERL సిఫార్సులను ప్రాజెక్టు నిర్మాణ యూనిట్ పాటించకపోవడం వల్ల పలు రకాలుగా ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో పాటు బ్యారేజీలకు తీరని నష్టం వాటిల్లుందని హెచ్చరించింది. TSERL సూచించిన గేట్ ఆఫరేషన్ షెడ్యలును అమలు చేయడంలో నిర్మాణం చేపట్టిన యూనిట్ పాటించలేదని, అవసరాలకు అనుగుణంగా గేట్లను ఆపరేట్ చేశారని ఎన్డీఎస్ఏ తేల్చింది. ఈ సిఫార్సుల్లో నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు బ్యారేజీ ముందు ఉన్న అడ్డంకులను తొలగించడంలోనూ నిర్మాణ యూనిట్ నిర్లక్ష్యం వహించిందని, అక్కడ మట్టి కట్టలు, ఇసుక మేటలు, షిట్ ఫైల్స్ తదితరాలను అక్కడే వదిలేశారని పేర్కొంది.
0 & M వైఫ్యలం…
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వింగ్ వైఫల్యాలను కూడా ఎన్డీఎస్ఏ గుర్తించింది. 2019లో నిర్మాణం పూర్తయిన తరువాత కట్ ఆఫ్ వాల్, సీసీ బ్లాకుల దిగువ ప్రాంతంలో భూమి లోపలి నుండి నీరు రావడం గమనించినప్పటికీ వాటి మరమ్మత్తుల కోసం డ్యాంలోని బ్యాక్ వాటర్ ని వదిలేయకుండా నిర్దేశిత అవసరాలకు వాడుకున్నారని చెప్పింది. ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో నీటిని విడుదల చేయకుండా నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం మళ్లించుకున్నారే తప్ప మరమ్మత్తుల చేయలేదని గుర్తించింది. ప్రాజెక్టు పూర్తయిన తరువాత 2019లో మొదటి వర్షాకాలం తరువాత నిర్మాణ యూనిట్, నిర్మాణ సంస్థలు మూడు బ్యారీజీలలోని సీసీ బ్లాకుల వద్ద ఏర్పడిన లోపాలను గుర్తించినా వాటిని వెంటనే బాగు చేయించేందుకు చొరవ తీసుకోకపోవడంతో క్రమక్రమంగా అవి డ్యామేజీ విస్తరించిందని వివరించింది. మొదటి వర్షాకాలం తరువాత మూడు బ్యారేజీలకు దిగువన సీసీ బ్లాకుల వద్ద ఏర్పడిన లోపాలు, ఇసుక పైపింగ్ విషయాలతో పాటు ఇతరాత్ర ఇబ్బందులను నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఎన్డీఎస్ఏ వివరించింది. అయితే వీటిని అధిగమించే విషయంలో మాత్రం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యూనిట్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయిందని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే రకమైన డిజైన్లతో ఉన్నాయని, నిర్మాణ పద్దతులు కూడా ఒకేలా ఉన్నాయని వెల్లడించింది. ఈ రెండు చోట్ల కూడా ఆపరేషన్ అండ్ మేయింటెనెన్స్ సక్రమంగా జరగలేదని, ప్రాజెక్టు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మరమ్మత్తులు విషయంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల అవి మరింత దెబ్బ తిన్నాయని వివరించింది. 2021 డ్యాం సేఫ్టీ యాక్ట్ లోని నిబంధనలు పాటించకపోవడం, బ్యారేజీలకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల నిర్మాణ సమయంలో ఏర్పడిన లోపాలు మరింత తీవ్ర రూపం దాల్చాయిని, పటిష్టమైన నాణ్యత నియత్రణ లేకపోవడం కూడా మరో కారణమని పేర్కొంది. కటాఫ్ వాల్స్ వద్ద నీటి ఒత్తిడి (water – tightness), కటాఫ్ గోడలకు రాప్ట్ కు ప్రత్యక్ష్యంగా అనుసంధానం చేసే విక్షషయంలో కంట్రోల్ లోపాల వల్ల పిల్లర్లు, రాప్ట్ లు కుంగిపోవడానికి రెండు ప్రాథమిక కారణాలని ఎన్డీఎస్ఏ వివరించింది.
ఆనకట్టల భద్రతలోనూ…
ఇకపోతే బ్యారేజీల భద్రత అంశాలను విస్మరించారని కూడా ఎన్డీఎస్ఏ కుండబద్దలు కొట్టింది. 2021 నేషనల్ డ్యాం సేఫ్టీ యాక్ట్ ప్రకారం నిర్మాణాల పరిస్థితిని అంచనా వేయడం కోసమేనని పేర్కొన్న ఎన్డీఎస్ఏ వర్షాకాలానికి ముందు (pre mansoon), వర్షాకాలం తరువాత (post monsoon) షెడ్యూళ్ల వారిగా తనిఖీలను విభజించారని, అయిేత ఈ విభాగం కాళేశ్వరం వద్ద ఎలాంటి తనిఖీలు చేయలేదని గుర్తించింది. 2021 చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్వహణ కార్యకలాపాలను లాగ్ బుక్స్ లలో ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుందని, రికార్డుల నిర్వహణలో తేది, సమయం, వాతావరణ పరిస్థితులతో పాటు ఈ తనిఖీల్లో పాల్గొన్న యంత్రాంగం కానీ కాంట్రాక్టర్ల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కానీ మెయింటెనెన్స్ రికార్డులలో ఎలాంటి వివరాలు లేవని, డ్యామేజీపై వార్షిక రుతుపవనాల తరువాత కూడా మదింపు తప్పనిసరైన చొరవ తీసుకున్న దాఖలాలు కనిపించలేదన్నారు. అప్రాన్ దిగువన ఉన్న ప్రాంతాలను తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం ఈ తనిఖీలను నిర్వహించలేదని స్పష్టం చేసింది.