విదేశి మద్యం లేదు… అనుమతి తీసుకోవాలని తెలియదు…

సింగర్ మంగ్లీ వివరణ…

దిశ దశ, హైదరాబాద్:

చేవెళ్ల రిసార్ట్స్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయంపై సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. తన బర్త్ డే సందర్భంగా తల్లిదండ్రులు, వారి స్నేహితులు, తన సన్నిహితులతో కలిసి చేసుకుంటున్న పార్టీ మాత్రమేనని అక్కడ విదేశి మద్యం కానీ, మత్తు పదార్థాలు కానీ లేవని స్పష్టం చేశారు. లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జన్మదిన జరుపుకోవాలని తన పేరెంట్స్ కోరడంతో అప్పటికప్పుడు పార్టీ ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. అయితే ఇందుకు సంబంధించి అనుమతులు తీసుకోవల్సి ఉంటుందని తనకు ఏ మాత్రం తెలియదని సింగర్ మంగ్లీ వెల్లడించారు. అయితే అక్కడ మత్తు పదార్థాల వినియోగం జరగలేదని, దేశీ మద్యంతోనే విందు ఏర్పాటు చేసుకున్నామని కూడా మంగ్లీ క్లారిటీ ఇచ్చేశారు.

రిసార్ట్స్ పై కట్టడి లేదా..?

భాగ్యనగరం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఏర్పాటు అవుతున్న రిసార్ట్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో రేవ్ పార్టీలంటూ, బర్త్ డే పార్టీలంటూ ఏదో ఓ సాకుతో రిసార్ట్స్ బుక్ అవుతున్నాయి. అయితే ఈ రిసార్ట్స్ వద్ద అసలేం జరుగుతోంది..? వాటికి అనుమతులు ఉన్నాయా..? అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించుకోవల్సి ఉంటుంది అన్న విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రిసార్ట్స్ లలో మద్యం పార్టీ ఇచ్చే విషయంలో కూడా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కొంత డబ్బు చెల్లించినట్టయితే అధికారికంగానే అనుమతి ఇచ్చే సాంప్రాదాయం ఉంటుంది. ఈ పర్మిషన్ తీసుకునేందుకు రిసార్ట్స్ నిర్వాహాకులే చొరవ తీసుకోవల్సి ఉంటుంది. పార్టీలు జరుపుకునే వారికి ఈ విషయంపై అవగాహన ఉండకపోయే అవకాశం ఉన్నందున రిసార్ట్స్ నిర్వాహకులే ఎక్సైజ్ విభాగం నుండి ఇందుకు సంబంధించిన అనుమతులు తీసుకున్నట్టయితే సరిపోతుంది. భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న సందర్భంలో ఎక్సైజ్ విబాగానికి కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని రిసార్ట్స్ నిర్వహాకులే చెప్పాల్సి ఉంటుంది. లేనట్టయితే నిర్వాహకుల వద్ద ఎక్సైజ్ శాఖ పర్మిషన్ కోసం చెల్లించాల్సిన డబ్బులు తీసుకుని ఇందుకు సంబంధించిన ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. లేనల్లయితే మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకుండా చూసుకోవల్సిన బాధ్యత కూడా రిసార్ట్స్ యాజమాన్యంపైనే ఉంటుంది. కానీ కమర్షియల్ అవసరాలకు మాత్రం తమ రిసార్ట్స్ అద్దెకు ఇస్తాం కానీ నిబంధనలు పాటించడం తమ విధానం కాదన్న రీతిలో వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనల మాటేమీటి..?

ఇటీవల కాలంలో రిసార్ట్స్ అద్దెకు ఇస్తున్న తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీల పేరుతో అక్కడ రేవ్ పార్టీలు జరుపుకుంటున్నా నియంత్రించే వారు లేకుండా పోయారు. నిర్మానుష్య ప్రాంతాల్లో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తూ తమ ఆదాయం కోసం యాజమానులు చూస్తున్నారు తప్ప అక్కడ చట్టాలను అతిక్రమిస్తున్న విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. రిసార్ట్స్ లో స్విమ్మింగ్ ఫూల్స్ వంటి సౌకర్యాలు కూడా కల్పించడంతో పాటు అక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఆయా శాఖల నుండి అనుమతులు తీసకున్నారా లేదా అన్న విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ అంశాలే కాకుండా అసాంఘీక కార్యకలాపాల కట్టడి బాధ్యతలోనూ రిసార్ట్స్ యజమానులు భాగస్వామలు కావల్సిందే. కానీ తాము మాత్రం అద్దెకు ఇస్తాం… అక్కడ ఏం జరిగినా తమకు మాత్రం సంబంధం లేదని చేతులు దులుపుకునే విధానం మాత్రం సరికాదు. ముఖ్యంగా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్స్ పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వం యంత్రాంగం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రిసార్ట్స్ బుక్ చేసుకునే వారి వివరాలను కూడా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే విధంగా చొరవ తీసుకోవడంతో పాటు వారి వివరాలను పోలీసులకు అందించినట్టయితే మత్తు పదార్థాల వినియోగం వంటి అంశాలపై వారు ఓ అంచానకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తదితర అన్ని విషయాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page