Maoist : వనం నుండి జనంలోకి…

అజ్జాత నక్సల్ దంపతులు

దిశ దశ, చెన్నూరు:

పోరు వదిలి ఊరు బాట పడుతున్నారు అజ్ఞాత నక్సల్. దశాబ్దాల కాలంగా విప్లవ పంథాలో కొనసాగుతున్న ముఖ్య నాయకులు వనాలు వీడి జనాలతో కలిసి జీవనం సాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయేందుకు సమాయత్తం అయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని పారుపల్లికి చెందిన ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి అరుణ దండకారణ్యంలోని బస్తర్ ఏరియాలో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు.