మావోయిస్టుల శిబిరం భగ్నం
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉధ్రిక్త పరిస్థితులకు అలా తెరపడిందో లేదో… మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహధ్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. మావోయిస్టు పార్టీకి పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుండి పోలీసులు ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
2 గంటలు… మూడు సార్లు…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్ సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కొత్తగా శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం అందుకున్న పోలీసు అధికారులు C60 కమెండోలను రంగంలోకి దింపారు. ఆదివారం మద్యాహ్నం నుండి భామ్రాగడ్ అటవీ ప్రాంతంలో 200 మంది C60 కమెండోలు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మావోయిస్టులకు, కమెండోలకు మధ్య ఎదరు కాల్పులు జరిగినట్టుగా గడ్చిరోలి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. భామ్రాగడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న C60 బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన కమెండోలు ఎదురు కాల్పులు జరిపారు. 2 గంటల వ్యవధిలో ఇదే అటవీ ప్రాంతంలోని వేర్వేరు చోట్ల ఇరు వర్గాల మధ్య మూడూ సార్లు ఎధురు కాల్పులు జరిగినట్టుగా పోలీసు అధికారులు వివరించారు. ఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టగా ఒక INSAS, ఒక సింగిల్ షాట్ రైఫిల్, ఒక మ్యాగజైన్, లైవ్ రౌండ్స్, డిటోనేటర్లు, ఒఖ రేడియో, 2 ఫిథస్, WT ఛార్జర్ మావోయిస్టు పార్టీకి చెందిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే నక్సల్స్ ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని కూడా ధ్వంసం చేశారని వివరించారు. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నక్సల్స్ చనిపోవడమో లేక గాయపడడమో జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. C60 బలగాలు భామ్రగఢ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నారు.