దిశ దశ, మహబూబాబాద్:
గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించే ఐస్ క్రీమ్స్ పై కన్నెర్రజేస్తున్నారు. ఐస్ క్రీమ్ అమ్మేందుకు వస్తే జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మహబూబాబాబ్ జిల్లా గూడురు శివార్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేసవికాలంలో ఐస్ క్రిమ్స్ విక్రయించి నాలుగు రాళ్లు సంపాదించాలనుకుంటున్న చిరు వ్యాపారులను గూడూరులోకి ఎంట్రీ లేదని స్పష్టం చేస్తున్నారు. పెద్దలు, గ్రామస్థుల పేరిట ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ షరతుకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కూడా వెల్లడిస్తున్నారు. రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తామని హెచ్చరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికొత్త చర్చకు దారి తీసింది. ఐస్ క్రీమ్స్ తినడం వల్ల చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గమనించిన గూడూరు వాసులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

