దిశ దశ, మహబూబాబాద్:
మహాబూబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య నెలకొన్న కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణాల మీదికి తెచ్చింది. వీరిలో ఒకరు మరణించగా మరోకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు… జిల్లాలోని అమనగల్లు హామ్లెట్ విలేజ్ అయిన బలరాంతండాకు చెందిన రమేష్, శాంతి దంపతుల మధ్య గత కొంతకాలంగా అశాంతి నెలకొంది. తాజాగా భార్యాభర్తలు గొడవ పడడంతో శాంతి కోపంతో పుట్టింటికి వెల్లిపోయింది. దీంతో తండ్రి రమేష్ పిల్లలిద్దరికి విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన చిన్నారులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రెండేళ్ల బాలుడు మరణించగా నాలుగేళ్ల బాలుడు గణేష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. గణేష్ ను బ్రతికించేందుకు డాక్టర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి రమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
