ఇంద్రావతి తీరంలో తూటాల ‘వర్షం’ నలుగురు మావోయిస్టుల మృతి

దిశ దశ, దండకారణ్యం:

జోరుగా వర్షం కురుస్తున్నా… మావోయిస్టుల ఏరివేత మాత్రం ఆగడం లేదు. భారీగా కురుస్తున్న వర్షంతో కీకారణ్యాల్లో అడుగు తీసి అడుగువేయలేని పరిస్థితులు నెలకొన్నప్పటికీ బలగాలు మాత్రం కూంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. అటు చత్తీస్ గడ్, ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని దండకారణ్య అటవీ ప్రాంతమంతా కూడా కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నది. వరసగా మూడో రోజు కూడా అభూజామఢ్ అటవీ ప్రాంతం రక్తసిక్తంగా మారిపోయింది.

గడ్చిరోలి జిల్లాలో…

మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసు అధికారులు 300 మంది C60 కమెండోలు, CRPF జవాన్లు కూంబింగ్ చేయిస్తున్నారు. అదనపు ఎస్పీ రమేష్ నేతృత్వంలోగురువారం మధ్యాహ్నం గడ్చిరోలి జిల్లా భామ్రేఘాడ్ సమీపంలోని కవాండే, నెల్గుండ ఇంద్రావతి నది తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ బలగాలు ఇంద్రావతి నది తీరంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉధయం ఇంద్రావతి నది తీరంలో తనిఖీలు జరుపుతున్న క్రమంలో మావోయిస్టులకు, బలగాలకు ఎదురు కాల్పలు చోటు చేసుకున్నాయి. దాదాపు 2 గంటల పాడు అడపాదడపా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు గడ్చిరోలి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, ఒక SLR, 303 రైఫిల్, బర్మార్, వాకీ టాకీలు, మావోయిస్టుల క్యాంపునకు సంబంధించిన ఇతరాత్ర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఈ అటవీ ప్రాంతంలో నక్సల్స్ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మరోవైపున సుక్మా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నక్సల్ ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page