కాళేశ్వరంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్… పుష్కరఘాట్ సాక్షిగా గందరగోళం…

దిశ దశ, కాళేశ్వరం:

కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ పంచాయితీ రగులుకుంది. సొంత పార్టీ నాయకుల మధ్య నెలకొన్న వైరం రచ్చ రచ్చగా మారింది. సరస్వతి పుష్కరం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోనే నిరసన వ్యక్తం కావడం సంచలనంగా మారింది.

దళిత ఎంపీపై వివక్ష…

పెద్దపల్లి దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆయన అనచరులు ఆందోళన నిర్వహించారు. సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించేందుకు కాళేశ్వరం వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు మండల నాయకుడు బాల గౌడ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో స్థానిక ఎంపీ అయిన వంశీ కృష్ణకు ప్రాధాన్యత కల్పించడం లేదంటూ నినాదాలు చేశారు. ఫ్లెక్సీలలో ఆయన ఫోటోలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ నిరసనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. బుధవారం నుండే దళిత సంఘాలు పెద్దపల్లి ఎంపీ విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీనే కావడంతో అంతర్గతంగా సమిసిపోతుందని భావించారు. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందే ఎంపీ వంశీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

కొంతకాలంగా…

అయితే పెద్దపల్లిలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ గతంలోనే ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మీడియా ముందు వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ విస్మరించి అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. గతంలో పార్టీ పరంగా జరిగిన కార్యక్రమాల్లో కూడా ఎంపీకి ఆహ్వానం లేకపోవడం వంటి అశాలు కూడా ఆయన అనుచరుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రోటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయం గురించి ఎంపీ వివరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎంపీ వంశీ విషయలో వివక్ష చూపుతున్నారన్న అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, తాజాగా సీఎం సభలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page