దిశ దశ, ఏపీ న్యూస్:
ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉధయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన 35 మంది వరకు AP39UM 6543 అనే నంబరు గల ప్రైవేట్ బస్సులో టూర్ చేస్తున్నారు. శనివారం వేకువ జామున అరుకు నుండి తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బయలు దేరారు. మారేడు మిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారి మెట్ట సమీపంలో బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మరణించగా చాలా మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, ఐటీడీఏ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నం అయింది. అంబూలెన్స్ ల ద్వారా క్షతాగాత్రులను చింతూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

