దిశ దశ, అంతర్జాతీయం:
భారతీయ రాష్ట్ర సమితీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా NRI సెల్ ఆయనకు ఘన స్వాగతం పలికింది. సిరిసిల్ల TO సిలికాన్ వ్యాలీ అంటూ KTRకు ఆహ్వానం పలికారు BRS నాయకులు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పురస్కరించుకుని కేటీఆర్ అమెరికాకు చేరుకున్నారు. భారీ సెక్యూరిటీ, కాన్వాయ్ నడుమ కేటీఆర్ హోటల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రాంత వాసులతో పాటు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ విభాగం భారీ ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.