Telangana police: అట్రాసిటీ కేసులో రూ. 3 లక్షలు… వాష్ రూం బకెట్లో పెట్టానంటున్న బాధితుడు…

సీఐతో మాట్లాడుతున్న ఆడియో వైరల్…

దిశ దశ, కరీంనగర్:

ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయంలో విచారణ అధికారిగా ఏసీపీ వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ తన వద్ద రూ. 3 లక్షలు తీసుకున్నావంటూ సీఐని ప్రశ్నిస్తున్నాడో వ్యక్తి… మీ ఛాంబర్ లోని వాష్ రూం బకెట్లో డబ్బులు పెట్టాను ఇందుకు సంబంధించిన వీడియో నా వద్ద ఉంది… సీపీకి, మీడియాకు పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అవతలి వ్యక్తి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఓ సీఐకితో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆడియో బయటకు రావడం సంచలనంగా మారింది. సీఐ కూడా అతనితో వాదనలకు దిగుతున్నప్పటికీ తనవద్ద బలమైన ఆదారం ఉందంటూ సదరు వ్యక్తి పదే పదే చెప్తుండడం గమనార్హం. స్టేషన్ ఆవరణలో తాను వచ్చిన సీసీ కెమెరాల ఫుటేజీ కూడా ఉంటుందని కూడా అతను సీఐకి గుర్తు చేస్తున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ఆడియో గురించి పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కులం పేరుతో దూషించిన కేసులో  తనను నిందితునిగా చేర్చారన్న విషయాన్ని ఊటంకిస్తున్న ఆ వ్యక్తి తాను వైట్ పేపర్ పై సంతకం చేసి మరో మనిషితో పంపిస్తాను తాను చెప్పినట్టు చేయాలని కోరగా ఏం చేయాలో చెప్పమని సీఐ అడిగినప్పటికీ ఇద్దరి మధ్య జరిగిన మాటలతో స్పష్టత లేకుండా పోయింది.

నమ్మి మోసపోయావ్…

మరో వైపున సీఐని సదరు వ్యక్తి హెచ్చరిస్తున్న తీరు కూడా ఆశ్యర్యంగా ఉంది. తనను నమ్మి వాష్ రూంలోకి పంపించడమే తప్పయిందని, ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ తన వద్ద ఉందని చెప్తుండడం గమనార్హం. నమ్మించి మోసం చేయడం సరైందనే అని సీఐ ప్రశ్నించగా  అవతలి వ్యక్తి నవ్వుతూ నన్ను అన్నలా భావిస్తున్నావంటూ కామెంట్ చేయడం విశేషం. పలు మార్లు సీఐని పేరు పెట్టి పిలుస్తూ తన వద్ద రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందంటూ చేస్తున్న వ్యాఖ్యల వెనక ఉన్న మర్మమేమిటన్న మిస్టరీ ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యే అవకాశం లేకపోలేదు.

స్టేషన్ లో కలిశారా…?

స్టేషన్ కు రావాలని వస్తే మాట్టాకుందామని సీఐ సదరు వ్యక్తికి పలుమార్లు సూచించినప్పటికీ అతును మాత్రం ససేమిరా అనడంతో మరో చోట కలుద్దామని ఓ సారి సీఐ ప్రతిపాదించారు. అమ్మె అక్కడకు వస్తే నా ‘భరతం’ పడుతావంటూ అవతలి వ్యక్తి అంటున్నారు. చివరకు మఫ్టీలో రైల్వే స్టేషన్ వద్దకు వచ్చినట్టయితే మాట్లాడుకుందామని సదరు వ్యక్తి ప్రతిపాదించగా అక్కడకే రావాలని సీఐ అంటున్నారు. అయితే వీరిద్దరూ రైల్వే స్టేషన్ లో కలుసుకున్నారా లేదా అన్న విషయం తెలియరావడం లేదు.

అధికారుల ఆరా..?

అయితే సీఐతో మాట్లాడిన ఈ ఆడియో గురించి పోలీసు అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆరా తీసినప్పుడు కొన్ని వివరాలు సేకరించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో కూడా అక్కడ పని చేసిన పోలీసు అధికారులతో ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించారని, కొంతమంది పోలీసు అధికారులకు ఈ అనుభవం ఎదురైందని పోలీసు అధికారులు విచారణ తేల్చినట్టుగా సమాచారం. ఈ విషయంపై శాఖపరంగా కూడా పూర్తిస్థాయిలో విచారించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page