దిశ దశ, ఏపీ బ్యూరో:
తన కూతురు నచ్చిన యువకుడితో దగ్గరుండి ఓ ఎమ్మెల్యే వివాహం జరిపించారు. ఏపీలోని ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన పెద్ద కూతురు పల్లవి ప్రేమ వివాహాన్ని జరిపించడం ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రేమించానని కూతురు చెప్పగానే సమ్మతించిన ఎమ్మెల్యే బొల్లవరం వెంకటేశ్వర ఆలయంలో వివాహం జరిపించారు. అనంతరం రిజిస్టర్డ్ మ్యారేజ్ కూడా చేయించారు. తనతో పాటు చదువుకుంటున్న పవన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నానని పల్లవి చెప్పగానే ఒప్పుకుని వివాహం జరిపించడం గమనార్హం. అంతేకాకుండా తన పెళ్లి నిరాడంబరంగా జరగాలని కూతురు కోరడంతో హంగు ఆర్భాటాలు లేకుండా వివాహం జరిపించారు.