ఖమ్మంలో ఘనంగా మహిళా దినోత్సవం


దిశ దశ, ఖమ్మం:

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఖమ్మం జిల్లాలో అంగరంగవైభవంగా సాగుతున్నాయి. మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ శ్రేణులు అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు ఆఫీసులో కూడా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పీఏ చిరుమల్ల రవి కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి పువ్వాడ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమాలు ఆయన పీఏ రవి కిరణ్ నేతృత్వంలో మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పువ్వాడ అత్యవసర పనుల్లో ఉన్నప్పుడు పీఏ రవికిరణ్ ప్రత్యక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు మహిళా దినోత్సవ వేడుకలు జరిపించారు.

cm kcrKCRkhammamKhammam newsLatest Newsminister puvvada ajay kumartelangana news