రెండు చోట్లా పోటీ చేస్తా: ఈటల రాజేందర్

హుజురాబాద్ లో మీరే కథా నాయకులు

దిశ దశ, హుజురాబాద్:

బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను అక్కున చేర్చుకున్న హుజురాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పైనా కూడా పోటీ చేస్తానని వెల్లడించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆయన బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నాన్నందున హుజురాబాద్ లో తనను గెలిపించేందుకు కథనాయకులుగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తనకు వచ్చిన పదవి హుజురాబాద్ ప్రజల వల్లే వచ్చిందని వ్యాఖ్యానించిన ఈటల రెండు చోట్ల పోటీ చేస్తానని మరో సారి స్పష్టం చేశారు.

bjp newseatela rajendareatela rajenderLatest Newstelangana news