పతి కోసం సతి భిక్షాటన…

పుట్టినిల్లు… మెట్టినిల్లు ఇక్కడే

దిశ దశ, హుజురాబాద్:

పతి గెలుపు కోసం ఓ సతి ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు చర్చకు దారి తీసింది. ఓటర్లు తమకు అండగా నిలిచి తన భర్తను అసెంబ్లీకి పంపించాలంటూ అభ్యర్థిస్తున్నారావిడ. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న కౌశిక్ రెడ్డి తన భార్య శాలినిని కూడా రంగంలోకి దింపారు. అయితే బుధవారం నియోజకవర్గంలోని ధర్మరాజుపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో శాలిని మాట్లాడారు. ఈ సందర్భంగా తన భర్తకు ఓట్లేయాలని అభ్యర్థిస్తూ తన పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ కూడా హుజురాబాద్ నియోజకవర్గమేనని తాను ఇక్కడి బిడ్డనేనంటూ చెప్పుకొచ్చారు. 15 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉంటున్న తన భర్తను గెలిపించాలని, తమ సొంత ప్రాంతమైన హుజురాబాద్ అభివృద్ది విషయంలో తమకు కూడా ప్రత్యేక శ్రద్ద ఉంటుందని వ్యాఖ్యానించారు. చివరకు కొంగుచాపి మిమ్మల్ని భిక్షం అడుగుతున్నఅంటూ శాలిని ఓటర్లను అభ్యర్థించారు.

2023 assembly electionshuzurabadkarimnagar newsLatest Newstelangana newsWife's begging for husband's votes