ఇక నా ఆటా పాట అందుకు అనుగుణంగానే…

ఏపూరి సోమన్న వెల్లడి

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ ఉద్యమకారుడు ఏపూరి సోమన్న భవిష్యత్తులో తన వ్యూహం ఏంటో వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ను కలిసిన తరువాత ఆయన విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక నుండి తన ఆట, పాట, మాట అన్ని కూడా తెలంగాణ అభివృద్దిలో భాగస్వామ్యం అవుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని సోమన్న ప్రకటించారు. అందరి సలహాల మేరకే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలు కేసీఆర్ అయితేనే తమకు మంచిదన్న నమ్మకం ప్రజల్లో ఇంకా నెలకొని ఉందని సోమన్న అన్నారు. వీటన్నింటిన బేరీజు వేసుకునే తాను కూడా బీఆర్ఎస్ పార్టీవైపు మొగ్గు చూపాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకొచ్చారు.

BRS NEWSLatest Newstelangana newsWhy am I joining BRS?: Epuri Somanna