అదుపు తప్పిన ‘అడ్లూరి’ వాహనం… స్వల్ప గాయాలు

దిశ దశ, కరీంనగర్:

ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ కుమర్ తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రానికి వెల్తుండగా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున 3.15 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తలకు దెబ్బ తగిలింది. ఈ ప్రమాదంలో మరికొంత మందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. అయితే లక్ష్మణ్ కుమార్ ను హుటాహుటిన కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి లక్ష్మణ్ కుమార్ కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించినట్టుగా సమాచారం. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపినట్టుగా సమాచారం. వెల్గటూర్ ఎస్సైతో పాటు పలవురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి.

cm revanth reddyJAGITIAL NEWSLatest Newstelangana newsWhip Adluri Laxman Kumar