దేశంలోనే స్పెషల్… తెలంగాణ సీఐడీ

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ సీఐడీ బృందం దేశంలోనే అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. 26 విభాగల పరీక్షల్లో 25 ఇంటిలో తన ప్రతిభా పాటవాలను చాటుకుంది. దేశ వ్యాప్తంగా ఎంహెచ్ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అఖిల భారత ఫింగర్ ప్రింట్ అక్రిడేషన్ పరీక్షలు నిర్వహిచింది. ఇందులో 26 స్థానాల్లో 25 ఇంటిని తెలంగాణ సీఐడీ సాధించుకుంది. నేర పరిశోధనల్లో కీలకమైన అంశాల్లో తెలంగాణ సీఐడీ బృందం సాధించిన తీరుపట్ల డీజీపీ అంజనీ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. వృత్తి నైపుణ్యంలో తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే అత్యుత్తమంగా నిలవడం శుభ సూచకమన్నారు.

crime newsDGP Anjani KumarLatest NewsTELANGANA CIDtelangana news