దిశ దశ, ధర్మపురి:
సహచర మంత్రి గడ్డం వివేక్ చేసిన వ్యాఖ్యలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను పార్టీ లైన్ తప్పనని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అన్న మాటల గురించి వివేక్ ఫోన్ చేసి చెప్తాడని అనుకున్నానని అయితే తెల్లవారి కూడా వివేక్ తనకు కాల్ చేయకపోవడం బాధ అనిపించిందన్నారు. నిజామాబాద్ సభలో తన పేరును ప్రస్తావించడం కూడా సరికాదన్న అడ్లూరి అంతర్గతంగా చర్చించిన విషయాలను బాహాటంగా వెల్లడించిన తీరు అభ్యంతరకరమన్నారు. తాను పార్టీ గీత దాటి మాట్లాడనని నిజామాబాద్ లో చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు, మర్యాదకు వదిలేస్తున్నానన్నారు.