జన జీవనంలోకి జనతన్ సర్కార్ … 108 మంది మావోయిస్టుల లొంగుబాటు

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీకి పెట్టని కోటకు బీటలు వారింది. జనజీవనంలోకి వచ్చే  క్యాడర్ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తెలంగాణాలోనే కాదు… చత్తీస్ గడ్ లోనూ సాయుధ నక్సల్స్ ఆయుధ విరమణ ప్రకటిస్తున్నారు. DKSZCలోని 108 మంది మావోయిస్టులు వనాలు వీడి జనారణ్యంలోకి వచ్చేశారు. చత్తీస్ గడ్ డీజీపీ ముందు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడినట్టేనని పోలీసు అధికారులు చెప్తున్నారు.

వచ్చిదెంత మంది..?

మావోయిస్టు పార్టీకి చెందిన వారు దండకారణ్య జోన్ లో దాదాపు 200కు పైగా ఉన్నారు. తాజాగా 108 మంది సరెండర్ కావడంతో మిగిలింది ఇక 92 మందేనని పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మావోయిస్టు పార్టీ 12 రాష్ట్రాల నుండి కేవలం ఐదు జిల్లాలకే పరిమితం కావడం జరిగింది. అయితే అడవిలో ఉన్న అన్నలు దాదాపు 200 మందికి లోపేనని తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో జగ్దల్ పూర్ లో 108 మంది ఆయుధాలతో లొంగిపోవడంతో సాయుధ నక్సల్స్ గణనీయంగా తగ్గిపోయినట్టేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మావోయిస్టు పార్టీ జనతన్ సర్కార్ గా ప్రకటించుకున్నా దండకారణ్య అటవీ ప్రాంతంలో ఏ మాత్రం పట్టు లేకుండా పోయినట్టేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. తాజా పరిణామాలు గమనిస్తుంటే మాత్రం DKSZCలో కూడా నక్సల్స్ కార్యకలాపాలకు బ్రేకు పడినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సాయుధం వదిలి…

సాయుధ పోరాటం… వదిలి వస్తున్న మావోయిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. తెలంగాణ పోలీసులపై ఉన్న విశ్వసనీయతతో మావోయిస్టులు జనారణ్యంలోకి వస్తున్నారు. మాడ్వి హిడ్మ ఎన్ కౌంటర్ తరువాత జరిగిన పరిణామాలు ఎన్నో అన్నట్టుగా సాగుతోంది లొంగుబాటు ప్రక్రియ. తాజాగా జగ్దల్ పూర్ లో 108 మంది నక్సల్స్ ఆయుధాలతో వనాలు వీడడం అనేది సంచలనంగా మారింది.

bastarchhattisgarhDANDAKARNYAMmaoist newsMAOIST PARTY
Comments (0)
Add Comment