కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడ్తాం

డీసీసీ ప్రధాన కార్యదర్శి

దిశ దశ, కరీంనగర్:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ కె సిరాజ్ హుస్సేన్ అన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన సందర్భంగా సోమవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకునే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసిన చరిత్ర ఉందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిస్తేనే అన్నింటా మైనార్టీలు అభ్యున్నతి వైపు సాగుతారని, అబద్దపు ప్రచారాలు చేస్తూ కాలం వెల్లదీసుకుంటున్న పార్టీలను నమ్మకూడదని విస్తృతంగా ప్రచారం చేయనున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా వారిని అన్నింటా చైతన్యవంతులను చేస్తామని ప్రకటించారు. తనకు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణల దిశా నిర్దశేంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెల్లేందుకు కృషి చేస్తామని సిరాజ్ హుస్సేన్ అన్నారు, తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేందుకు విశేషంగా కృషి చేస్తానని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస పార్టీ జిల్లా నాయకులు ఎస్.ఏ.మొసీన్, నిహాల్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, యం.డి.ఇమ్రాన్, యం.డి.సలేమొద్దిన్, హైమద్ అలి తదితరులు పాల్గొన్నారు.

dcckarimnagar newsLatest NewsPONNAM PRABHAKARtelangana news