మునిసిపాలిటీలో ముష్టి యుద్దం…

దిశ దశ, ఏపీ బ్యూరో:

మునిసిపల్ సమావేశం అనగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు… విమర్శలు, ప్రతి విమర్శల గురించి వింటుంటాం. అభివృద్ది గురించి అధికారులను నిలదీసే సందర్బాలూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది మునిసిపల్  మీటింగ్. ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. ఆంధ్రపదేశ్ లోని పిఠాపురం మునిసిపల్ మీటింగ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిఠాపురం మునిసిపల్ మీటింగ్ సందర్భంగా కమిషనర్, డీఈఈ మధ్య మాటల యుద్దం కాస్తా ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు చేరింది. అక్కడే ఉన్న మునిసిపల్ సిబ్బంది ఇద్దరు అధికారులను వారించడంతో సద్దుమణిగింది.

andhra pradesh newsap latest newsap newsLatest News