ఇక సెలవు సంజయ్ అన్నా…

ఖమ్మంలో యువకుడి ఆత్మహత్యా యత్నం

దిశ దశ, ఖమ్మం:

బండి సంజయ్ అధ్యక్ష్య బాధ్యతల తొలగింపును తట్టుకోలేకపోయిన అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. సంజయ్ అన్నా… ఇక సెలవు అంటూ రాసిన లేఖ చదివిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఖమ్మం జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ తన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూసైడ్ అటెమ్ట్ చేసుకున్నశ్రీనివాస్ ను హుటాహుటిన ఖమ్మం పట్టణంలోని శ్రీ రక్ష ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమయంగానే ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. బండి సంజయ్ అన్నను అధ్యక్ష్య స్థానం నుండి తొలగించడం వల్ల నాకు బాదాకరంగా ఉందని శ్రీనివాస్ సూసైడ్ నోట్ లో రాయడం సంచలనంగా మారింది.

bandi sanjaybjp chief bandi sanjayBJP TELANGANAcrimecrime newsCRIME TODAYtelganana bjp news