కరీంనగర్ అమిత్ షా టూర్ రద్దు… : బండి సంజయ్ వెల్లడి

దిశ దశ, కరీంనగర్:

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన రద్దయింది. ఆదివారం కరీంనగర్ టూర్ షెడ్యూల్ అంతా ఫిక్సయిపోయి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అమిత్ షా రాక కోసం ఏర్పాట్లలో మునిగిపోయిన నేపథ్యంలో ఢిల్లీ నుండి ఈ సమాచారం అందింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా టూర్ షెడ్యూల్ రద్దయిందని సంజయ్ వెల్డించారు. కరీంనగర్ లో ఆదివారం మద్యాహ్నం కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన 20 వేల మంది కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలు, బీహార్ సమీకరణాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకోవల్సి వచ్చిందని తెలుస్తోంది. అయితే మరోసారి ఆయన పర్యటన ఉంటుందని పార్టీ క్యాడర్ సమాయత్తంగా ఉండాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

amith shahbandi sanjaybjp newsLatest Newstelangana news
Comments (0)
Add Comment