అక్కడ మామ… ఇక్కడ అల్లుడు…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల తీరు…

దిశ దశ, కరీంనగర్:

అధికార బీఆర్ఎస్ పార్టీలో ఇరుగు పొరుగు నియోజకవర్గాల్లో మామా అల్లుల్లు ప్రజా క్షేత్రంలో తమ సత్తా ఏంటో నిరూపించుకోబోతున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలు వేర్వేరుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ వైవిద్యత చోటు చేసుకోడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మామా అల్లుల్లుకు పక్కపక్క నియోజకవర్గాలు కెటాయించడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి చేస్తున్న చల్మెడ లక్ష్మీ నరసింహరావు, జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి పోటీ చేస్తున్న డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ లు మామా అల్లుల్లు కావడం విశేషం. వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్న వెంకటేశ్వర్ రావు కూతురును కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ వివాహం చేసుకున్నారు. దీంతో ఈ మామ అల్లుల్లు ఇద్దరు కూడా ఒకే సారి పక్కపక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడం విశేషం. వీరిద్దరూ ఒకే సారి చట్ట సభలోకి అడుగు పెడుతారా లేదా అన్న చర్చ సాగుతోంది.

BRS NEWSJAGITIAL NEWSkarimnagar newskorutlaLatest Newstelangana news