వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృత్యువాత

దిశ దశ, హుజురాబాద్:

వేకువ జామునే కరీంనగర్, వరంగల్ రహదారిలో మరణ మృందంగం సాగింది. సైదాపూర్ రహదారిలో రోడ్లు శుభ్రం చేసే పారిశుద్ద కార్మికురాలు, ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాత పడ్డారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో బుధవారం వేకువ జామున రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ కార్మికుల మీదుగా కారు దూసుకెళ్లింది. వరంగల్ నుండి కరీంనగర్ వైపు వెల్తున్న కారు ఢీ కొట్టిన సంఘటనలో పట్టణంలోని మామిండ్ల వాడకు చెందిన నల్గొండ సమ్మక్క (55) అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన రాచపల్లి రాజేశ్వరీని 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరు కూడా మునిసిపల్ కాంట్రాక్టు కార్మికులేనని తెలుస్తోంది. మరో వైపున హుజురాబాద్, కరీంనగర్ రహదారిలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

crimecrime newsCRIME TODAYtelangana crimetelangana crime newstoday crime news