TRS రికార్డ్ బ్రేక్…

అధికార టీఆరెఎస్ పార్టీ రికార్డు బ్రేక్ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. కామ్రేడ్స్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఇప్పటి వరకూ ఆధిపత్యం చెలాయించినప్పటికీ జిల్లాలోని జిల్లాలోని అన్ని స్థానాలను ఒకే పార్టీ కైవసం చేసుకున్న చరిత్ర మాత్రం లిఖించ లేదు. కానీ మొట్టమొదటి సారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ గులాభి జెండా ఎగురేయడం టీఆరెఎస్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గులాభి పార్టీ అభ్యర్థులే గెలవడం కూడా విశేషం. సాగర్ ఎన్నికల్లో భరత్, హుజూర్ నగర్ పోల్స్ లో సైదిరెడ్డి, మునుగోడులో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు గెలిచారు. ఈ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆరెఎస్ పార్టీ అధిక్యం సాధించడం విశేషం. మరో వైపున ఉప ఎన్నికల్లో విజయాలు సాధించాలనుకున్న బీజేపీ స్కెచ్ కు కూడా టీఆరెఎస్ పార్టీ బ్రేకులు వేసింది.

cm kcrKCRKomatireddy Rajagopal ReddyLatest NewsMunugode BypollTelangana Bypolltelangana newstrs mlatrs party