భారీగా ఐపీఎస్ ల బదిలీలు…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రైల్వే, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా ఉన్న మహేష్ ఎం భగవత్ లా అండ్ ఆర్డర్ ఏడీజీగా, టీజీఎస్పీ ఏడీజీ స్వాతి లక్రా ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ కు, గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ ఏడీజీ విజయ్ కుమార్ పర్సనల్, వెల్ఫైర్, స్పోర్ట్స్ కు, టీజీఎస్పీ బెటాలియన్స ఏడీజీగా సంజయ్ కుమార్, గ్రే హౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, మల్టీజోన్ 2 ఐజీ జి సుధీర్ బాబు రాచకొండ సీపీగా, ఏసీబీ డైరక్టర్ గా తరుణ్ జోషీ, మల్టీజోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, రైల్వేస్, రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ నాయుడు, జాయింట్ కమిషన్ ర్ గా ఉన్న వి సత్యనారాయణను మల్టీ జోన్ 2 ఐజీగా, వనపర్తి జిల్లా ఎస్పీ రక్షితా మూర్తి సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ సిటీ డీసీపీగా, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ ఎస్పీగా, ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వనపర్తి ఎస్పీగా, బి బాలస్వామి ఈస్ట్ జోన్ డీపీసీగా, రాచకొండ టాస్క్ ఫఓర్స్ డీసీపీగా ఉన్న జి చంద్రశేఖర్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు.

HyderabadIps officers transfersLatest NewsTelangana IPS Transferstelangana news