ఎస్సై భార్య బలవన్మరణం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ టూ టౌన్ లో ఎస్సైగా పని చేస్తున్న చంద్ర శేఖర్ భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్నేరుపప్పు దంచుకుని తిన్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని హునుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న చంద్ర శేఖర్ భార్య దివ్య మంగళవారం ఇంట్టో గన్నేరు పప్పు దంచి తిన్నడంతో ఆరోగ్యం విషమించింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థకు గురైన దివ్యను కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందించి హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా మరణించారు. దివ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావల్సి ఉంది. చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా వీరు ఏడేళ్ల వయసు వరకు ఉంటుంది. చిరు ప్రాయంలోనే తల్లిని కోల్పోయిన ఆ బిడ్డలను చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

crimeflash newskarimnagar crimeLatest NewsTG NEWS
Comments (0)
Add Comment