రేణిగుంట టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జాం…

దిశ దశ, కరీంనగర్:

దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ వెల్లే రహదారులన్ని కూడా రద్దీగా మారిపోయాయి. సోమవారం నుండి డ్యూటీలో చేరాల్సిన ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ చేరుకునేందుకు ఆదివారం మద్యాహ్నం నుండే తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో రాజీవ్ రహదారిలోని తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ గేట్ వద్ద వాహానాలతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, మంచిర్యాల జిల్లాలకు చెందిన వారంతా హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయింది.  టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 

HKR ROADHyderabadkarimnagar newsLatest Newstelanganan news