విచారణకు హాజరైన నవదీప్

దిశ దశ, హైదరాబాద్:


నార్కోటిక్ పోలీసుల విచారణకు టాలీవుడ్ హీరో నవదీప్ హాజరయ్యారు. కొద్ది సేపటి క్రితం హైదరబాద్ లోని నార్కోటిక్ కార్యాలయానికి చేరుకున్నారు. మదాపూర్ డ్రగ్స్ కేసులో ఎ29 నిందితునిగా ఉన్న నవదీప్ డ్రగ్స్ సప్లయి చేసే రామచందర్ తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో విచారణలో ప్రశ్నించే అవకాశం ఉంది. నవదీప్ ద్వారానే సినీ ఇండస్ట్రీలోని పలవురికి డ్రగ్స్ సరఫరా అయి ఉంటాయన్న అనుమానాలు కూడా విచారణాధికారులకు వచ్చాయి. రామచందర్ పట్టుబడిన తరువాత నవదీప్ కనిపించకుండా పోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. ఇదే సమయంలో హై కోర్టును ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయ్నత్నించగా ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ విచారణకు హాజరు కావల్సిందేనని హై కోర్టు నవదీప్ ను ఆదేశించడంతో నార్కోటిక్ అధికారులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు ఇచ్చిన రోజున కూడా నవదీప్ ఇంట్లో లేకపోవడంతో ఇంటికి అంటించి వెళ్లిపోయారు. దీంతో శనివారం 12 గంటల ప్రాంతంలో నవదీప్ హైదరాబాద్ లోని నార్కోటిక్ కార్యాలయానికి చేరుకున్నారు.

cm kcrcrime newsLatest NewsMadapur drugs caseTOLLYWOODTollywood hero Navdeep arrives at Narcotic office