ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే నిర్మించారు


ఏపీలో తెలంగాణ సీఎంపై ‘బండి’ ఫైర్

దిశ దశ, ఏపీ స్పెషల్ కరస్పాండెంట్:

తెలంగాణ వైట్ హౌజ్ పై రాష్ట్ర కాషాయ దళపతి మరోసారి మండిపడ్డారు. దీని నిర్మాణం వెనక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ఇదంటూ బండి సంజయ్ తేల్చి చెప్పారు. శనివారం కర్నాటకలో బీజేపీ ప్రచారానికి హాజరై తిరిగి వస్తున్న ఆయన అనంతపురలో మీడియాతో మాట్లాడుతూ… ఏంఐఎం నేత ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని నిర్మించారని ఆరోపించారు. అదసలు సచివాలయంలా లేదని, తాను మాత్రం ప్రారంభోత్సవానికి వెల్లేది లేదని బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. ఓ వర్గం వారిని సంతృప్తి పర్చేందుకు నిర్మించారని, కావలిస్తే సచివాలయం వద్దకు వెల్లి సెల్ఫీ తీసి చూసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయంలో మార్పులు చేర్పులు చేసినప్పుడే తాను అందులోకి అడుగుపెడ్తానని స్పష్టం చేశారు. భారత, తెలంగాణ సంస్కృతిని ప్రతి బింబించే విధంగా సచివాలయ నిర్మాణం జరగలేదని, దాని డోమ్స్ కూల్చిన తరువాత తెలంగాణ సాంప్రాదాయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసిన తరువాతే తాను అందులోకి అడుగుపెడ్తానని తేల్చి చెప్పారు. అక్కడ మసీదు కోసం 5గుంటల స్థలం కెటాయించి, 80 శాతం ఉన్న హిందువులు ఆరాధించే నల్లపోచమ్మ ఆలయానికి కేవలం రెండున్నర గుంటలు కెటాయిస్తారా అంటూ బండి సంజయ్ ద్వజమెత్తారు. తెలంగాణ హిందూ సమాజం ఆలోచించాలని కేసీఆర్ పాలనలో బాంచన్ బతుకులు బ్రతకాలా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి సచివాలయానికి వెల్లినా ఒకటే వెళ్లకపోయినా ఒకటేనని వ్యాఖ్యానించారు.

bandi sanjaybandi sanjay kumarbjp chief bandi sanjaybjp newsBJP TELANGANALatest NewsMP BANDI SANJAYtelangana news