గాల్లో తేలియాడిన అభిమానం

పవర్ స్టార్ కు వింత అనుభవం

దిశ దశ, తిరుపతి:

గబ్బర్ సింగ్ ను హడలెత్తించాడో అభిమాని. అందరిలా తానూ చేస్తే వెరైటీ ఏముంటదనుకున్న పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు జయం సినిమాలో నితిన్ ను మరిపించాడు. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా వెల్తున్న జనసేనానికి కిక్కిచ్చేలా ఆభిమానాన్ని చాటుకున్నాడు. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రేణిగుంట నుండి ర్యాలీగా వెల్తున్న పవన్ కళ్యాణ్ కు మార్గ మధ్యలో ఓ అభిమాని క్రేన్ లిఫ్టింగ్ ద్వారా శాలువా కప్పాడు. సాధారణంగా క్రేన్ సాయంతో తమ నాయకుడికో అభిమాన నటీ నటులకు గజ మాలతో ఘనంగా సత్కరించి థమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు ఇలా చేస్తే అందరిలో తానొక్కడిని అవుతాననుకున్నాడో ఏమో ఈ అభిమాని క్రేన్ కు జయం సినిమాలో హీరో నితిన్ ను మరిపించే విధంగా వేలాడుతూ పవర్ స్టార్ కు శాలువా కప్పి దండ వేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

ap newsjenasenaLatest NewsMEGA BROTHERSMEGASTARPawan KalyanTollywood News