రామ్ చరణ్ కూతురు పేరంటంటే..?

దిశ దశ, సినిమా:

కొణిదెల వంశాంకురాలికి నామకరణ మహోత్సం కార్యక్రమం కంప్లీట్ చేశారు. మెగాస్టార్ ఇంట పుట్టిన ఆడబిడ్డకు పేరు పెట్టేందుకు ఏరి కోరి సెలెక్ట్ చేశారు. చెర్రి భార్య ఊపాసన ఇటీవల పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలికి ఏం పేరు పెట్టారోనన్న విషయం ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించిన కూతురికి క్లీంకారా కొణిదెల అని నామకరణం చేసినట్టుగా చిరంజీవి అందులో పేర్కొన్నారు. కాస్తా వెరైటీగా ఉన్న ఈ పేరు వెనక ఉన్న అసలు కథ ఏంటంటే..? లలితా సహస్ర నామాల ఆధారంగా సేకరించి ఈ పేరును ఎంపిక చేసుకున్నామని చిరంజీవి తెలిపారు. ప్రకృతి స్వరూపాన్ని, దివ్యమైన తల్లి శక్తి యోక్క అత్యున్నత శక్తిని ఈ పేరులో నిక్షిప్తమై ఉందని పేర్కొన్న మెగా స్టార్ తన ఇంట జన్మించిన లిటిల్ ప్రిన్సెస్ ఎదిగే కొద్ది తన వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింప జేస్తుందని ఆశిస్తున్నానన్నారు.

CHERRYCHIRANJEEVIMEGA BROTHERSMEGASTARRAM CHARANTollywood News