ఓడినందుకు బాధలేదు…. నిరాశ పడ్డా: కేటీఆర్

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల వెలువడుతున్న నేపథ్యంలో ఆయన చేసిన షేర్ చేసిన పోస్టులో కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వరసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దోహదపడిన తెలంగాణ ప్రజలకు థన్యాదాలు తెలిపారు. ఆదివారం విడుదల అయిన తెలంగాణ పలితాలను చూసి బాధపడలేదు కానీ… అది ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందానని పేర్కొన్నారు. ఈ పలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు… మీకు శుభం కలగాలని కోరుకుంటాన్నాను అంటూ ‘ఎక్స్’ వేదికగా కామెంట్ చేశారు.

2023 assembly electionscm kcrKt ramaraoktrThis is Minister KTR's response to Telangana election results