స్ట్రాంగ్ రూం వద్ద తేనెటీగల దాడి

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద తెనేటీగలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా దాడికి పాల్పడడంతో అక్కడున్న వారు తెనేటీగల బారిన పడకుండా ఉండేందుకు పరుగు అందుకున్నారు. ధర్మపురి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను స్కాన్ చేసి హై కోర్టుకు పంపించేందుకు సమాయత్తం అయిన నేపథ్యంలో అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకు ఊహించని షాక్ తగిలింది. మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే కాలేజీ వద్ద స్ట్రాంగ్ రూంలోకి వెల్లే పనిలో ఉన్న వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తెనెతుట్టెను గుర్తు తెలియని వ్యక్తులు కదపడమో లేక వాటంతట అవే లేచి వచ్చాయో తెలియదు కానీ వందల సంఖ్యలో తేనెటీగలు అటాక్ చేయడంతో అక్కడకున్న వారంతా పరుగులు పెట్టారు. ఊహించని విధంగా తెనెటీగలు దాడి చేయడంతో అందరు షాక్ కు గురయ్యారు. కొంతమందికి గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది.

తేనెటీగల దాడితో పరుగందుకున్న వైనం
adloori laxman kumarJAGITHYAL NEWSLatest Newsminister koppulatelangana newstelugu newsYasmin Bhasha Ias