నా హత్యకు కుట్ర: సినీ నటి గౌతమి

దిశ దశ, చెన్నై:

తన స్థిరాస్థిని కాజేసేందుకు ఫోర్జరీ డాక్యూమెంట్లు క్రియేట్ చేయడమే కాకుండా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సీనియర్ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనకు వారి నుండి రక్షణ కల్పించడంతో పాటు తన ఆస్థుకు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సీనియర్ హీరోయిన్ గౌతమి రూ. 25 కోట్ల భూమిని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకుని ఓ ఏజెంటుకు ఈ పని అప్పగించారు. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో స్థిరాస్థిలో కొంత భాగాన్ని అమ్మాలని నిర్ణయించుకుని ఓ ఏజెంటును ఆశ్రయించగా ఆయన ఆ ఆస్థిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గౌతమి ఆరోపించారు. అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించినందుకు సదరు ఏజెంటు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె వివరించారు. రాజకీయ అండదండలతో తనతో పాటు తన కూతురిని కూడా హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని గౌతమి పోలీసులకు వివరించారు. ఏజెంటుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు.

actress GautamiLatest NewsThey are threatening to kill me: Senior actress GautamiTOLLYWOOD