సీఎం రేవంత్ రెడ్డితో ఎవరెవరు ప్రమాణం చేస్తారంటే..?

దిశ దశ, హైదరాబాద్:

గురువారం నాడు తెలంగాణ నూతన ప్రభుత్వం బాధ్యతలు తీసుకోనుంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా ఏ రేవంత్ రెడ్డి పేరు ఖరారు కావడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. గురువారం నాడు రాజ్ భవన్ లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి అయితే రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మిగతా శాఖల మంత్రులుగా ఎవరెవరు ఉండాలి అన్న అంశంపై కూడా కసరత్తులు చేస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణతో పాటు సీనియారిటీని ప్రాతిపదికన క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ నుండి కూడా ఇలాంటి సంకేతాలే రావడంతో సమ న్యాయం పాటించే విధంగా చూస్తున్నారు.

DUDDILLA SRIDHAR BABUtelangana cm revanth reddyTelangana CM's swearing-in ceremony postponed..?These are the ministers who will take oath along with Revanth Reddy