హైదరాబాద్ నగరంలో ఘోరం.. మరణమృదంగంతో విషాదం…

దిశ దశ, హైదరాబాద్:

అకాల వర్షం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. వరద నీటి కారణంగా ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడమే కాకుండా జనజీవనం అతలాకుతలమైంది. మరో వైపున మరణాలు కూడా సంభవించడం మహానగరంలో విషాదాన్ని నింపింది. బేగంపేట ప్రాంతంలోని నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకరాగా మరణించిన వారి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలడంతో ఏఢుగురు చనిపోయారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలిన సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శిథిలాల కింద ఏడు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను గాంధీకి తరలించారు. మృతుల్లో తిరుపతి రావు (20). శంకర్ (22), రాజు (25) రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4) ఖుషీలు ఉన్నారు.

BACHUPALLYcrimeHyderabadsad news