మళ్లీ మొరాయించిన చాపర్…

సీఎం పర్యటనలకు అంతరాయం

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తున్న హెలిక్యాప్టర్ తరుచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా ఉంది. తాజాగా మరోసారి ఆయన టూర్ చేస్తున్న చాపర్ లో టెక్నికల్ ప్రాబ్లెం ఎదురు కావడం గమనార్హం. గతంలో రెండు సార్లు హెలిక్యాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తగా తాజాగా బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలోనూ హెలిక్యాప్టర్ మోరాయించింది. ఇంతకు ముందు ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు చాపర్ మొరాయించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనేందుకు ఉపయోగిస్తున్న హెలిక్యాప్టర్ లో తరుచూ టెక్నికల్ ప్రాబ్లెమ్స్ ఎదురవుతుండడం చర్చ నీయాంశంగా మారింది.

cm kcrKCRLatest Newstelangana newsThe helicopter in which Chief Minister KCR is doing tours has a technical fault again