ఆరు గ్యారెంటీలపై ముగ్గు వేసిన అభిమాని…


దిశ దశ, జగిత్యాల:

కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు వినూత్న పద్దతి ఎంచుకున్నారక్కడ. ఆరు గ్యారెంటీల స్కీం అన్న నినాదంతో సక్సెస్ అయి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజల్లో తనదైన స్టైల్లో ప్రచారం చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగలాయపేటకు చెందిన సుమలత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లపై కూడా తనకున్న అభిమానాన్ని తనలోని సృజనాత్మకత ద్వారా ప్రదర్శించారు. సంక్రాంతి పండగ సందర్బంగా చుక్కల ముగ్గులు వేసి తమ స్పెషాలిటీని ప్రదర్శిస్తుంటారు. అయితే సుమలత మాత్రం కాస్తా డిఫరెంట్ గానే ఆలోచించారు. ఇంటి ముందు రంగవల్లులు వేయాలి కాని పదిమందికి అర్థం కావాలని తపించారు. ఈ మేరకు తమ వాకిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలను వివరిస్తూ తనలోని కళాత్మకతను చేతల్లో చూపించారు సుమలత. అంతేకాకుండా ముగ్గు చుట్టూ  జై కాంగ్రెస్, జై  రేవంత్ రెడ్డి, జై అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అని రాశారు. అందరి మహిళల వలె రథం ముగ్గు, రాట్నం ముగ్గు అని వేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల స్కీంలను వివరిస్తూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంది. అందరిలా తాను కూడా ముగ్గు వేస్తే స్పెషాలిటీ ఏముంటుంది..? కాంగ్రెస్ పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకోవాలంటే ఇలా వేస్తే ఎలా ఉంటుంది అని వైవిద్యంగా ఆలోచించి సుమలత వేసిన ఈ ముగ్గు గురించి స్థానికులు చర్చించుకున్నారు. 

cm revanth reddyCONGRESS PARTYJAGITIAL NEWSsix guaranteestelangana news
Comments (0)
Add Comment