ఆలయ ఛైర్మన్ పై ధర్మకర్త ఫిర్యాదు

హుండీ లెక్కింపు సమయంలో చోరీ చేశారంటూ ఆరోపణ

దర్యాప్తు జరిపించండి : ధర్మకర్త ఫిర్యాదు

దిశ దశ, జగిత్యాల:

ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు సమయంలో ఆలయ ఛైర్మన్ చోరీకి పాల్పడ్డారంటూ ధర్మకర్త ఒకరు ఈఓకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ నెల 9న అంజన్న క్షేత్రంలోని హుండీ లెక్కింపు జరిపిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని ఈఓ వెంకటేష్ కు ధర్మకర్త జున్ను సరేందర్, ముత్యంపేట సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డిలు బుధవారం ఫిర్యాదు చేశారు. భక్తులు హుండీలో వేసిన నగదు, నగలను వేరు చేస్తున్న క్రమంలో విలువైన వస్తువులు ఛైర్మన్ తిరుకోవెల మారుతి స్వామి దొంగలించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హుండీ లెక్కింపు రోజున ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

crime newsCRIME TODAYkondagattuLatest Newstelangana news