దాభాలో ఛాయ్ తాగిన సీఎం

దిశ దశ, సిద్దిపేట:

రయ్ మంటూ కాన్వాయ్ దూసుకపోతోంది… రోడ్లకిరువైపులా పోలీసులు పహారా కాస్తున్నారు… సెక్యూరిటీ వాహనాల సైరన్లతో సాగుతోందా వాహణ శ్రేణి… సడెన్ గా వాహనాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో బలగాలన్ని అప్రమత్తం కాగా, అటువైపుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు అసలేం జరిగిందో అర్థం కాకుండా పోయింది. మంగళవారం రాత్రి రాజీవ్ రహదారిపై చోటు చేసుకున్న పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల, సిద్దిపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ నుండి దిగి మరీ హో దాభా హోటల్ లో ఛాయ్ తాగారు. ఇందు కోసం సీఎం కేసీఆర్ రాజీవ్ రహదారిలోని ఓ దాభా హోటల్ వద్ద ఆగిపోవడం అందరినీ ఆశ్యర్యంలోకి ముంచెత్తింది. ఛాయ్ తాగిన తరువాత సీఎం కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్ కు పయనం అయ్యారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ దామోదర్ రావు, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్, మాజీ స్పీకర్ మధు సూధనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ లు ఉన్నారు.

2023 assembly electionscm kcrKCRLatest Newstelangana newsThe CM's convoy stopped at a hotel on the side of Hyderabad Road